పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు

bookmark

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనుసు ద్రుఢము
కులముకన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వధాభిరామ వినురమేమ

తాత్పర్యం-
రోజూ పూజా పురస్కారములు చేస్తూ నేను మంచి వాణ్ని అనుకుంటే సరిపోదు. ఎన్ని పూజలు చేసిన బుద్ది వంకరగా ఉంటే లాభం లేదు. బుద్ధి బాగుండవలెను. మాటకంటే మనసు గట్టిది కావలెను. కులముకంటే గుణము ముఖ్యంగా ఉండవలెను అని దీని అర్థం.
sri rama