నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బయట మూరెడైన బారలేదు
నెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం-
నీటిమీద చాలా చక్కగా పోగల ఓడ నేల మీది కొస్తే కొంచెం కూడా ముందుకు కదలలేదు. అలాగే ఎంత నేర్పుగలవాడైనా తనకు అనుకూలమైన స్థానం దొరకనప్పుడు ఎందుకూ పనికిరాడు.
