నా దేశము
గౌతమీ కృష్ణవేణీ తుంగభద్ర పె
న్నా నదుల్ పాఱు మాగాణి గడ్డ
భ్రమరాంబ, కనకదుర్గాదేవి, వెంకన్న
పొత్తిళ్ళ బెంచిన ముద్దు బిడ్డ
నాగార్జున, విజయనగర, వినూత్న క
ళా సరస్వతుల విలాస భూమి
నన్నయ్య, యజ్ఞ తిక్కన్న, పోతన్నది
కవుల వాగ్వల్లి బంగారు తల్లి
కృష్ణరాయ మహీజుని, విష్ణువర్ణ
నాది నృప బాహు దండంబులందు నలం
మఱల స్వేచ్ఛా ప్రపూర్ణయై మాన్యమైన
ఆంధ్ర్మాతకు భక్తి జోహారు లిడుచు
కట్టిన దాంధ్రమాత యిడు కమ్మని ఖద్దరు బట్ట, వెన్నతో
బెట్టిన విద్యలే సహజ వీర పరాక్రమ శౌర్య సంపదల్
పుట్టిన దాంధ్రదేశమని పొంగని యాంధ్రుడొకండు కల్గునే
పుట్టిన దేశమాత రుణమున్ సరిదీర్చినవాడె యాంధ్రుడున్
ఏ నాంధ్రుండను, పుట్టి పెర్గితి కదోయి అంధ్రదేశాననీ
నా నోటన్ వినుభెల్ల, కాలమనది యాంధ్రమ్మాయి, యీ దేశమం
తా నా దేశమే, స్వీయ రక్త మది, ఆంధ్రంబేకదా యంచున్
నానందింపని వాడొకండు కలడే, ఆంధ్రేతరుండున్ వినా
తెలుగు దేశము నాయది, తెనుగు వాడ
తెలుగుతల్లి యనుంగు చేతులను బెరిగి
తెలిసి గొంటిని, మంటిని, తెలుగు తల్లి
పేరు నిలుపుటె మీదె యూపిరి జెలంగ
