ధీరులకు జేయు మేలది

bookmark

ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్‌
గారవమును మరిమీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!

తాత్పర్యం:
బుద్ధిమంతుడికి చేసే మేలు కొబ్బరికాయలోని నీరు వలే శ్రేష్టమైనది, ప్రియమైనది, గొప్ప సుఖానికి స్థానాన్ని ఇచ్చేదీ అగును.