తెలుగు సూక్తులు - 9
1. నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
2. నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
3. నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
4. నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
5. నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.
6. నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
7. నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
8. నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
9. నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.
10. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
11. నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.
12. నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీతల్లి తండ్రులను ప్రేమించు.
13. నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.
14. నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి.
15. నీతిగల వానికి నిందాభయం లేదు.
16. నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.
17. నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
18. నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
19. నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.
20. నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
21. నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
22. నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
23. నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
24. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
25. పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్
26. పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.
27. పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
28. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
29. పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
30. పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.
31. పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.
32. పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.
33. పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
34. పనిచేయని వాడికి తినే హక్కులేదు.
35. పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
36. పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.
37. పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
38. పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.
39. పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
40. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
41. పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
42. పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.
43. పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్
44. పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహా విజేత
45. పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
46. పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
47. పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతి అభివృద్ధి పరచుకోవాలి - బాబా.
48. పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
49. పాలల్లో వెన్నవలే, ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు.
50. పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.
