తెలుగు సూక్తులు - 8
1. దూరపు కొండలు నునుపుగా తోచు.
2. దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
3. దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.
4. దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది
5. దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
6. దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.
7. దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.
8. దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
9. దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
10. దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
11. దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
12. దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
13. దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
14. ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.
15. ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.
16. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
17. ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
18. ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
19. ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.
20. ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
21. ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
22. నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.
23. నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
24. నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
25. నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట.
26. నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
27. నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
28. నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
29. నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
30. నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
31. నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
32. నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.
33. నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
34. నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.
35. నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.
36. నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.
37. నిజం కానిది నిజంగా గొప్పది కాదు.
38. నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.
39. నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
40. నిజము నిలకడ మీద తెలియును.
41. నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
42. నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
43. నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
44. నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
45. నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
46. నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
47. నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
48. నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
49. నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
50. నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.
