తెలుగు సూక్తులు - 19

bookmark

31. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు.

నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.

32. జననం మరణం సహజం
ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు
వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు

జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.

33. అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.

34. నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.

35. నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను..
ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే...

36. ఆత్మ చేధింపబడజాలదు..
దహింపబడజాలదు..
తడుపబడజాలదు..

37. మరణం అనివార్యం
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు
ఎవరూ అమరులు కాదు.

38. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!!

39. ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో, నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను...

40. ఓడిపోయావని భాదించకు
మరల ప్రయత్నించి చూడు
ఈసారి విజయం నీ తోడు వస్తుంది