తెలుగు సూక్తులు - 16
తెలుగు సూక్తులు - 16:
1. శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయు:ప్రమాణం వందేళ్లు. అయితే ప్రస్తుత యాంత్రిక యుగంలో మారిన జీవనశైలి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనికి మన స్వయంకృతాపరాధమే కారణం. మారుతున్న జీవనశైలితో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారంలో విదురుడు పేర్కొన్నాడు.
2. తను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు.
3. అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది.
4. తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.
5. ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడనివారు కూడా నేరుగా నరకానికి పోతరాట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.
6. ధర్మ శాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.
7. మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది.
పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.
8. జీవితంలో మార్పు కోరుకుంటే దాని కోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాల్లో నిర్ణయాలు తీసుకోకండి.
9. జీవితమంటే మంచి, చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. చెడు గురించి విచారించకండి, అది ఎల్లకాలం ఉండదు.
10. డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు.
