తెలుగు సూక్తులు - 15

bookmark

1. విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.

2. విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.

3. విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.

4. వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.

5. వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.

6. వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.

7. వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.

8. వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.

9. వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.

10. వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.

11. శక్తి అన్నిటిని జయిస్తుంది. కానీ ఆవిజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి.

12. శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.

13. శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.

14. శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.

15. శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.

16. శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.

17. శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.

18. శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.

19. శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.

20. శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.

21. శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.

22. శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.

23. సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.

24. సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.

25. సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.

26. సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.

27. సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.

28. సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు

29. సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది

30. సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.

31. సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమి సాధించలేము.

32. సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.

33. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.

34. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ - ఈ ఆరే ఆప్తులైన బంధువులు.

35. సత్యదేవతకు మనం చూపగల భక్తి, ఆ వెలుగులో నడవగలగడమే.

36. సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.

37. సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు.

38. సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.

39. సత్యాన్ని గూర్చిన సిద్దాంతాలు మారిన అసలు సత్యం ఎప్పటికీ మారదు.

40. సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.

41. సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.

42. సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము.

43. సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.

44. సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.

45. సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.

46. సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.

47. సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.

48. సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.

49. సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.

50. సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్ధించండి, మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు.

51. సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.

52. సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.

53. సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్ధం.

54. సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.

55. సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.

56. సాహసించని వాడు గెలుపును సాధించలేడు.

57. సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.

58. సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.

59. సుగుణమే నిజమైన గొప్పదనం.

60. సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి.

61. సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.

62. సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.

63. సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.

64. సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.

65. సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.

66. స్ధిరమైన మీ న్యాయబుద్ది మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది

67. స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి.

68. స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.

69. స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.

70. స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.