తెలుగునేల
ప్రాచీన సంస్కృతి పరిఢవిల్లిన నేల
పౌరుషాగ్నికి పేరుపడిన నేల
జాతీయ స్పూర్తికి జయకేతమౌనేల
జాగృతీ క్రతువులన్ జరుపునేల
పరమస్వంతంత్రేచ్ఛ పరిమళించెడు నేల
పోరులో వెన్నొడిబోని నేల
చేతనాయుతమైన చేవకల్గిన నేల
వీరులగన్న బంగారునేల
వెలుగు జిలుగుల నెలబాల తెలుగునేల
దిక్కులేక రాహువునోట చిక్కెనేడు
చక్రిపై లేచి చూపు పరాక్రమమ్ము
కలిగిన ధీరుడా తెలుగువాడ
