తమాషా ప్రశ్నలు -16

bookmark

1. అన్నం లో వెసుకోలేని రసం ?
పాదరసం

2. రేణి గుంట లో ఫలం ?
రేగు

3. జై పూరు లో బీద ?
పూర్

4. చార్మినార్ లో దాగున్న నటి ఎవరు?
చార్మి

5. అందరికి ఇష్టమైన కాయ ఏది?
ఆవకాయ

6. అందరూ భయపడే బడి ?
చేతబడి

7. అందరూ ఇష్టపడే బడి ?
రా బడి

8. కాల్లు లేని టేబులు ఏది ?
టైం టేబులు

9. పనండు అయినా కాయ అనేది ?
నిమ్మకాయ

10. కనపడని వ్రు క్షం
కల్పవ్రుక్షం

11. మూటలు మోయని పోర్టరు?
రిపోర్టర్

12. ముట్టు కొంటె షాక్ కొట్టె రెంట్ ఏది?
కరెంటు

13. కొడంగల్ లో దాగున్న పక్షి?
కొంగ

14. శకుని లో దాగున్న దేవుడు?
శని

15. బందరు మిఠాయి తినే టప్పడు కనబడనిది?
బందరు

16. కలింగపట్టనం లో అల్లుడుకి మామ గారు ఇచ్చేది ?
కట్నం

17. ఆసుపత్రి లో వినాయకపూజకి అవసరమైనదేది ?
పత్రి

18. మైసూరు బోండా తినేటప్పుదు కనిపించనిది ?
మైసూరు

19. రేడియేషన్ లో ప్రభుత్వము ప్రజలకి ఇచ్చేది?
రేషన్

20. బెల్లం కొండలో ఊన్న కూర ?
బెండ