తమాషా ప్రశ్నలు -12

bookmark

1. అనసూయలో మనిషికి ఉండకూడనిది ?
అసూయ

2. ఎవరికీలేని కన్ను ?
సీతకన్ను

3. బడికిరాని మాస్టర్ ?
పోస్ట్ మాస్టర్

4. తాగలేని పాలు ?
మురిపాలు

5. దండ గుచ్చ లేని పూస ?
వెన్నపూస

6. ఎప్పుడూ మారని తరం ?
వందేమాతరం

7. చెసే పనులు చూసి చెప్పే రుచి ?
అభిరుచి

8. మనుషులు లేని భవనం ?
వక్రీ భవనం

9. మెరిసే నైట్
గ్రానైట్

10. చారలు లే ని జీబ్రా ?
ఆల్జీబ్రా

11. బ్యాంకు ఇవ్వని రుణం
దారుణం

12. ఎగ్జా మినర్ దిద్దని పేపర్
న్యూస్ పేపర్

13. జనానికి ఇస్టపడే జనం
భో జనం

14. ఆరోగ్యా న్ని కాపాడే క్యాండిల్
ఫిల్టర్ క్యాండిల్

15. పిల్లలు భయపడే పూజ
బడితపూజ

16. తొడుక్కొనే రాయి
షరాయి

17. ఏ ధ్యానం చెస్తూ నడిస్తే ప్రమాదం
పరధ్యానం

18. సూది గుచ్చ లేని పూస
వెన్నపూస

19. పాలు తాగని పాప ఏది
కనుపాప

20. సీసాలో పొయ్యలేని ద్రవం
ఉపద్రవం