తమాషా ప్రశ్నలు -11
1. పూజకి పనికిరాని ఫ్లవర్ ?
కాలీ ఫ్లవర్
2. పాడలేని రాగం?
అనురాగం
3. పేరులో పది ఉన్నది ఎ వరు ?
ద్రౌ పది
4. ఆటవస్తువు పేరున్న పువ్వు ఏది ?
బంతి పువ్వు
5. హారంలేని మని ?
గ్రామని
6. బత్తలు నేయని సాలి ఎవరు ?
కంసాలి
7. వినిపించలేని స్వ రం ?
భాస్వ రం
8. బైరాగి లో దాగున్న లోహం?
రాగి
9. చీడపురుగుల్లొ ఇల్లు ఊడ్చే ది ?
చీపురు
10. తో డు లేకుండా చెయ్యలేని సాయం ?
వ్య వసాయం
11. అందరూ పూజించే గ్రామం ?
సాలగ్రామం
12. భక్తులు పూజించని సాయి ఎవరు?
కసాయి
13. కూర్చోలేని పీట్ ఏది?
కత్తిపీట
14. మనుషులు లేని పురం ఏది?
గోపురం
15. దేవుడు లేని ఆలయం?
సచివాలయం
16. చక్రా లు లేకుండా వెల్లే కారు
పుకారు
17. కదపలే ని కాలు ఏది ?
ఉద్రేకాలు
18. చెల్లని కాసు ?
తిరకాసు
19. తినలేని చెరుకు ?
వంటచెరుకు
20. తినలేని పండు ?
విబూది పండు
