తమాషా ప్రశ్నలు -1

bookmark

1. ఆటలు ఆడని ప్లేయర్ ఏంటి?
సీడీ ప్లేయర్!

2. డ్రైవర్ లేని బస్ ఏది ?
సిలబస్!

3. నాలుకపైన పెట్టుకుంటారు గానీ మింగరు- ఏమిటది?
తపాలా బిళ్ళ!

4. పంజరంలో ఏముంటుంది?
ఏదిపెడితే అదే!

5. తోటలో పండిన మామిడి పండ్లు కోయడానికి సరైన కాలమేది?
తోట మాలి లేనికాలం!

6. వాస్తు శాస్త్రిని బిచ్చగాడు ఏమడిగాడు?
'ఏ చెట్టు కింద కాపురం మొదలు పెట్టమంటారు?' అని!

7. "పాప" భీతి అంటే* * * ?
'పాప' అంటే భయపడటం

8. ఎగరవేయలేని జెండా?
అజెండా

9. వానర రాజు ఎక్కడ ఉన్నాడు?
కావాలి లో

10. చెట్టుకు కాయని కాయలు?
బకాయిలు

11. కూర్చోలేని ఆసనం?
ధర్మాసనం

12. రాజు లేని రాణి ఎవరు ?
పారాణి

13. రైతు పట్టని హలం అ?
కోలాహలం

14. ఏడిస్తే ఏమౌతుంది ?
కన్నీలొస్తాయి

15. ఎవరూ తాగని సారా ?
వసారా

16. గుండు హనుమంత చేయించుకోనిది ?
గుండు

17. రాజు లేని రాణి ?
పారాణి