చెన్నపట్నం చెరుకు ముక్క,
చెన్నపట్నం చెరుకు ముక్క,
నీకో ముక్క నాకో ముక్క
భీమునిపట్నం బిందెల జోడు,
నీకో బిందె నాకో బిందె
కాశీ పట్నం కాసులపేరు,
నీకో పేరు నాకో పేరు
కొండపల్లి కొయ్య బొమ్మ,
నీకో బొమ్మ నాకో బొమ్మ
నిర్మలపట్నం బొమ్మల పలక,
నీకో పలక నాకో పలక
నూజివీడు మూమిడి పండు,
నీకో పండు నాకో పండు
కాకినాడ కాజా,
నీకో కాజా నాకో కాజా
ఇస్తా ఉండు తెచ్చినాక,
చూస్తూ ఉండు తెచ్చేదాక
