చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె

bookmark

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీటబడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యము :
ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి వుంటే.. ఏ కార్యంలోనైనా తప్పకుండా లాభం కలుగుతుంది.