చిక్కియున్న వేళ సింహంబునైనను

bookmark

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము :
అడవికి మృగరాజు అయిన సింహం కూడా చిక్కిపోయి వున్నపుడు.. వీధిన పోయే బక్క కుక్క ఆ సంహాన్ని బాధపెట్టడం మొదలుపెడుతుంది. అదేవిధంగా తగిన బలం లేనప్పుడు పౌరుషాన్ని కూడా ప్రదర్శించరాదు.