చక్కిలిగింతలు
(పసిబిడ్డలను పెద్దవారు దగ్గర కూర్చుండబెట్టుకొని అరచెయ్యి పట్టుకొని ఈ క్రింది పదము చెప్పుతూ ఆయా పనులు చేస్తున్నట్టు అభినయస్తూ చివరకు బిడ్డ చంకలో చక్కలిగింత పెట్టుతారు. బిడ్డ నవ్వుతుంది.)
పప్పుపెట్టి, పాయసంపెట్టి,
అన్నంపెట్టి, అప్పచ్చిపెట్టి,
కూరపెట్టి, ఊరుగాయపెట్టి,
నెయ్యివేసి, ముద్దచేసి,
తినిపించి, తినిపించి,
చెయిగడిగి, మూతిగడిగి,
తాతగారింటికి దారేదంటే,
(అత్తవారింటికి దారేదంటే,)
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
మోచేతిపాలెం ముందర్నించి,
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
ఇదిగో ఇదిగో, వచ్చాంవచ్చాం,
చక్కావచ్చాం, చక్కావచ్చాం,
చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి!
