గుమ్మాడమ్మా

bookmark

గుమ్మాడమ్మా గుమ్మాడీ,
ఆకుల్లువేసింది గుమ్మాడీ,
పూవుల్లు పూసింది గుమ్మాడీ,
పండ్లుపండిందమ్మ గుమ్మాడీ,
అందులో ఒకపండు గుమ్మాడీ,
అతి చక్కనీ పండు గుమ్మాడీ,
ఆ పండు యెవరమ్మ గుమ్మాడీ,
మాచిట్టి తండ్రమ్మ, గుమ్మాడీ!