కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
కులము గలుగువాఁడు గోత్రంబు గలవాఁడు
విద్యచేత విఱ్ఱవీగువాఁడు
పసిడి గలుగువాని బానిస కొడుకులు
విశ్వధాభిరామ వినురమేమ.
తాత్పర్యం-
మనిషి మంచి కులమునూ, గోత్రమును కలిగి ఉన్నా, చదువుకున్న వాడు నాకే చదువు ఉందని విఱ్ఱవీగినా, వాడు పసిడి (బంగారం) ముందు బానిస లాంటి వాడే.. అంటే కులము, గోత్రం, చదువు కంటే బంగారానికే ఎక్కువ విలువ అని దీని భావం.
