కులములోన నొకఁడు గుణవంతుఁడుండిన

bookmark

కులములోన నొకఁడు గుణవంతుఁడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజం బున్నట్లు
విశ్వధాభిరామ వినురమేమ.

తాత్పర్యం-
కులములో ఒక్కడు బుద్ధిమంతుడు ఉన్నా అతని గుణము చేత ఆ కులములో అంతా వాడి కీర్తి ప్రకాశిస్తుంది. అట్లాగే వనములో (అడవిలో) ఒక్క గంధము చెట్టు యున్న దాని వాసన ఆ అడవి అంతటికి వ్యాపిస్తుంది. అంటే మనిషి గుణమును బట్టి వ్యక్తి తత్వము తెలుస్తుందనేది దీని భావం.