కుండ కుంభమన్న కొండ పర్వతమన్న

bookmark

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటికాదె
భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ !

తాత్పర్యము :
కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు కలిగి వుంటాయి. ఎలా అంటే.. కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము వంటి పదాలు పలకడానికి వేరేవిగా వున్నా.. వాటి అర్థాలు మాత్రం ఒక్కటే! అదేవిధంగా మన సంస్కృతిలో భాషలు ఎన్ని వున్నప్పటికీ వారందరికీ పరతత్త్వం మాత్రం ఒక్కటే!