కాకీ కాకీ కడవల కాకీ
కాకి కాకి కడవల కాకి
కడవను తెచ్చి గంగలో ముంచి
గంగ నాకు నీళ్ళు ఇస్తే
నీళ్ళను తెచ్చి ఆవుకు ఇస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలను తెచ్చి అవ్వకి ఇస్తే
అవ్వ నాకు జున్ను ఇచ్టే
జున్నును తెచ్చి పంతులుకిస్తే
పంతులు నాకు చదువు చెప్పే
చదువును తెచ్చి మామకి ఇస్తే
మామ నాకు పిల్లను ఇచ్చే
పిల్ల పేరు మల్లె మొగ్గ,
నా పేరు జమిందార్
