ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు

bookmark

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము :
విరిగిన ఇనుమును రెండు లేదా మూడుసార్లవరకు అతికించవచ్చు. కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే (ఏదైనా చెడువార్త వల్లగానీ, విషయం జరగడం వల్లగానీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయినప్పుడు) మాత్రం.. దానిని మళ్లీ అతికించడానికి ఆ బ్రహ్మదేవుని వల్ల కూడా కాదు.