అక్కరకురాని చుట్టము
అక్కరకురాని చుట్టము,
మ్రొక్కిన వరమీన వేల్పు, మోహరమునదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ.
తాత్పర్యం:
అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము,ఎంత ప్రార్దించినా వరమియ్యని దేవతా,మంచి యుద్దసమయములో తాను చెప్పినట్టు పరుగెత్తని గుర్రములని వెంటనె విడిచిపెట్టవలెను.
